Sunday, 10 August 2008

వచ్చే వారం మార్కెట్ వీక్షణం



ఓం నమో భగవతే శ్రీ రామ కృష్ణ య
అందరికి నమస్కారం. ఈవారం తో మొదలుపెట్టి ప్రతివారం నిఫ్టీ మీద నా అభిప్రాయాలని ఇక్కడ ప్రచురించాలని నా సంకల్పం. అలాగే ప్రతిరోజు కొన్ని కొన్ని షేర్ల మీద నా అభిపరయలను కూడా ఇక్కడ ప్రచురించాలని నా ఆపేక్ష. ఇక్కడ చెప్పబడే అంశాలు అన్నీకూడా కేవలం విద్యా పరమైన ఆసక్తి తో ప్రచురించటం జరుగుతున్నది తప్ప ఇక్కడ ప్రచురించబడే విషయాల ఆధారంగా ఎటువంటి లావాదేవీలు నిర్వహించవద్దు అని మనవి. ఎవరైనా అటువంటి లావాదేవీలు నిర్వహిస్తే దానికి సంపూర్ణ బాధ్యత వ్యవహర్త దే అవుతుంది. ఈ బ్లాగ్ ఎటువంటి బాధ్యత వహించజలడు అని మనవి.
ఎనిమిది ఆగస్ట్ రెండువేల ఎనిమిది తో ముగిసిన వారానికి నిఫ్టీ లాభాలలో ముగిసింది. అంతకుముందు వారంతో పోలిస్తే సుమారుగా నోట ముప్ఫై నాలుగు పాయింట్లు లాభం ఆర్జించింది. ఇదే తీరూ రాబోయే వారాలలో కూడా కొనసాగుతుందా లేదా అనే విషయాన్నీ టెక్నికల్ అనల్య్సిస్ సహాయం తో పరశీలన చేసే ప్రయత్నం చేద్దాం.
నిఫ్టీ యొక్క స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ పదిహేను రోజులుగా వున్నది. దీని విలువ ప్రస్తుతం నాలుగువేల మూడువందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిదిగా వున్న్నది. నిఫ్టీ యొక్క దీర్ఘకాలపు మూవింగ్ యావరేజ్ ఇరవై తొమ్మిది రోజులుగా వున్నది. దీని విలువ ప్రస్తుతం నాలుగువేల ఒక వంద తొంభై ఎనిమిది పాయింట్ రెండు మూడు గ వున్నది. స్వల్పకాలపు యావరేజ్, దీర్ఘకాలపు యావేరజే కన్నా పిఅన వుండి వూర్ద్వ ముఖం గ కొనసాగుతున్నది. రెండు యావరేజ్లు కూడా వూర్ద్వ ముఖంగా కోన సాగుతున్నాయి. కాని చివ్వరి రెండు ట్రేడింగ్ దినములు నిఫ్టీ తక్కువ దినసరి హెచ్చు తగ్గులను నమోదు చేసింది. ఇందువల్ల కొంత అదోముఖం ప్రయాణం చేసిన నిఫ్టీ మరల పుంజుకొని తన వూర్ద్వ ముఖ ప్రయాణం కోన సాగించ వచ్చు. పైన వున్నా చార్ట్స్ రెండవ దాన్ని గమనించినట్లయితే ఇనర్శియా తన వూర్ద్వ ముఖ ప్రయాణం కొంసగించతాన్ని గమనించవచ్చు. దీర్ఘ కాలిక ట్రెండ్ తెలియజేయటం లో ఇనర్శియా చాల ప్రముఖ మైయిన ఇండికేటర్. అయితే ఇద ఇంక తన సున్నా రేఖ ను దాత వలసి వున్నది. అలాగే చంద్ మొమెంతుం ఆసిలతోర్ ఇంక ఓవర్ బాట్ స్థాయికి చేరలేదు. అందువలన నిఫ్టీ మరికొంత ముండుకువేల్లె అవకాసం వున్నట్టు తోస్తున్నది. నిఫ్టీ లక్ష్యం నాలుగువేల ఆరువందల తొంభై ఎనిమిది గా వుండే అవకాసం వున్నది. నిఫ్టీ ఈ స్థాయికి చేరిన తరువాత కొంత వొత్తిడికి లోను అయ్యే అవకాసం వున్నది.
సుబ్రహ్మణ్యం